Authorization
Sat April 05, 2025 12:16:41 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం కోరడం నేరమా?అని అఖిల భారత ప్రగతిశీల రైతుసంఘం (ఏఐపీకేఎస్) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాయల చంద్రశేఖర్, వి ప్రభాకర్, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి దేవారం, పి రామకృష్ణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కోదండరామ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, డీబీఎఫ్ శంకర్, రైతు నాయకులు కె రవి, విస్సా కిరణ్లను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.లక్ష, ధాన్యం, మామిడి తోటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.