Authorization
Sat April 05, 2025 10:56:02 am
- గౌరవ సలహాదారుగా బోయినపల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గురుకులాల ప్రిన్సిపల్స్ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 1,062 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు ఆదివారం హైదరాబాద్‌లో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నూతన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ఆర్. అజరుకుమార్, రాంబాబు ఎన్నికయారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు బంగారు భవిష్యత్తును కల్పించడమే ఏకైక లక్ష్యంగా తమ సంఘం పని చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అంకిత భావంతో కషి చేయాలని బోయినపల్లి తమరికి ఈ సందర్భంగా సూచించారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోరండ్ల చంద్ర మోహన్, కోశాధికారి జక్కని రాజేశం, ఉపాధ్యక్షులుగా బి రాజేష్, ఎం నీరజ, స్వాతి, కార్యదర్శులుగా జి శ్రీకాంత్, సునీత, వాణి, సహ కార్యదర్శులుగా బిక్షపతి, మహిళా కార్యదర్శి నీలిమా దేవి, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి విద్యాసాగర్, వరంగల్ గ్రేటర్ ఇంచార్జి టి.శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.