Authorization
Sat April 05, 2025 05:15:50 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయ, సహకార విభాగంలో అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పోస్టుల భర్తీకి ఈనెల 16న రాతపరీక్షను ఆన్లైన్ నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నుంచి ఏవో పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశముంటుందని వివరించారు. ఈనెల 16వ తేదీ పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే.