Authorization
Sat April 05, 2025 03:02:05 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇంటింటికీ సీపీఐ ముగింపు కార్యక్రమాన్ని జూన్ 4వ తేదీ కొత్తగూడెంలో 'ప్రజాగర్జన'పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మనుధర్మం, విద్య కాషాయీకరణ, నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల కష్టాలు, పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ సభను నిర్వహిస్తామన్నారు. ప్రజాగర్జన సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, కార్యదర్శులు కే నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు.
15న హుస్నాబాద్ సభ
హుస్నాబాద్‌లో ఈనెల 15న 25వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు బలమైన హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, బెల్లంపల్లి, దేవరకొండ నియోజకర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. సీట్ల సర్దుబాటును ఎన్నికల సమయం నాటికి మాట్లాడుతామని చెప్పారు.