Authorization
Thu April 03, 2025 08:58:00 am
- సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో అపరేషన్, నిర్వహణ పనులను ప్రతిరోజూ సమీక్షించాలని ఆ శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అధికారులు పంపిన ఆయా ప్రతిపాదనలకు పనుల కమిటీ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఈనెల 31లోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు ప్రతిరోజూ తనిఖీలకు వెళ్లాలని ఆదేశించారు. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు చేయించడంలో వెనుకబడితే, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.