Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-షాబాద్, షాద్నగర్
కర్నాటక నుంచే దేశంలో మార్పు మొదలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా షాబాద్, కొందుర్గు మండలాల్లో కొనసాగింది. షాబాద్ మండల పరిధిలోని మరియాపురం గ్రామ శివారు వద్ద కర్నాటక ఎన్నికల ఫలితాలను ఫోన్లో చూశారు. కాంగ్రెస్ పార్టీ గెలవడంతో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి షాబాద్, కొందుర్గు మండలాల్లో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం రద్దు చేయడం అంటే ప్రతిపక్షాన్ని రద్దు చేయడమే అన్నారు. బీజేపీకి కర్నాటక ప్రజలు తగిని గుణపాఠం చెప్పారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి పామెన భీమ్ భరత్, నాయకులు పాల్గొన్నారు.