Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ, పీవైఎల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతోన్మాద బీజేపీ ఓడించిన కర్నాటక ప్రజలకు పీడీఎస్యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీలు జేజేలు ప్రకటించాయి. ఈ మేరకు పీడీఎస్యూ, పీవైఎల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి మహేష్, డి సాయిరెడ్డి, ఎస్వి శ్రీకాంత్, ఇ సాగర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మతోన్మాద, ఫాసిస్టు, కార్పొరేట్ విధానాలను అవలంభిస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ అంబానీ, అదానీలకు కొమ్ముకాస్తున్న బీజేపీని ఓడించడం దేశానికి మంచి పరిణామమని తెలిపారు. బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాలకు ఈ ఫలితాలు చెంపపెట్టు అని విమర్శించారు. మతోన్మాద, ఫాసిస్టు బీజేపీని ఓడించాలంటూ పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామిక, లౌకిక విలువల కోసం పోరాడుదామని కోరారు.