Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ-జైపూర్
అసైన్డ్ భూముల్లో కబ్జాదారుల ఆగడాలు అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివారు బావురావుపేట్ భూపోరాట కుటుంబాలను శనివారం ఆయన కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బావు రావుపేట్ శివారు సర్వే నెం.8లో అసైన్డ్ భూమిని పేదల ఇండ్ల స్థలాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 14 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభు త్వం, అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిం చడం సరికాదన్నారు. భూపోరాటంలో పాల్గొంటున్న మహి ళలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నార న్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు లేని పేదలను పట్టించుకోకపోవడం భావ్యం కాదన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిచ్చి ఇస్తామని ఇప్పటి వరకు నెరవేర్చలేదని తెలిపారు. అక్రమార్కుల చేతుల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీన పర్చుకోవాలని డిమాండ్ చేశారు. పేదల న్యాయమైన పోరాటానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమం లో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రేంకుమార్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొడంకి చందు, కావిరి రవి, పట్టణ కార్య దర్శి ఆవేజ్, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ నాయ కులు మణి, శ్రీనివాస్, ప్రసన్న, రేణుక, సాజిత్, సంధ్య, లలిత, సమ్మక్క, లత, వైశాలి, భానుమతి, రాధిక, లక్ష్మి, నవీన్, ఉమారాణి, మౌనిక పాల్గొన్నారు.