Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య భర్తల మధ్య తగాదాలే కారణం
నవతెలంగాణ-దుండిగల్
కూలీ తలకు బలమైన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషి నగర్ తాలూకా ఫాజీ నగర్‌కు చెందిన మనోజ్ చౌహన్(35) ఆరేండ్ల కిందట ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. దుండిగల్ మున్సిపాల్టీ బౌరంపేట్ పరిధిలోని సతీష్ కో అపరేటివ్ సొసైటీ సమీపంలోని శివ టైల్స్ కంపెనీలో అతను, అతని భార్య లక్ష్మీ చౌహన్ దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో మూడేండ్లుగా తమ కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్య వేరొకరితో ఫోన్లో మాట్లాడడం చూసిన భర్త గొడవపడ్డాడు. అనంతరం ఆదివారం తెల్లవారేసరికి మనోజ్ చౌహన్ ఇంటి పరిసర ప్రాంతంలో తలకు బలమైన గాయాలతో శవమై కనిపించాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. భార్య హత్య చేసిందా.. లేక ఇతరులు ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.