Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 లక్షల మందికి రీడింగ్ అద్దాల పంపిణీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు విజయవంతంగా కొనసాగుతు న్నాయి. 74 పని దినాల్లోమొత్తం కోటిన్నరకు చేరువకు మందికి పరీక్షలు చేశారు. ఇప్పటికే 21 లక్షల మందికి రీడింగ్ అద్దాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 'అంధత్వ రహిత' తెలంగాణ లక్ష్యం నినాదంతో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 10, 285 గ్రామ పంచాయతీ వార్డుల్లో, 3221 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా మల్కాపూర్‌లో తొలివిడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినసంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి నుంచి ఇప్పటివరకు 50 లక్షల మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. అదే స్ఫూర్తితో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గత జనవరి 18 న ఖమ్మంలో ప్రారంభించారు. అనుకున్న లక్ష్యంమేరకు విజయవంతంగా కొనసాగుతున్నది. లక్ష్యంగా నిర్దేశించుకన్న 100 పనిదినాల్లో రాష్ట్రంలో అందరికి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పరీక్షల సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర శాఖలతోసహా, అందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. పర్యవేక్షణకుగానూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నది. ఇదే విధంగా కంటివెలుగు విజయవంతంగా కొనసాగితే రెండు కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని వైద్యాధికారులు వ్యక్తం చేశారు.