Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'తానా' కార్యాలయ ప్రారంభోత్సవంలో బోయిన పల్లి బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హౌమ్స్ అసోసియేషన్ (తానా) నూతన కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్ కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవన సముదాయంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఈ సందర్భంగా బోయినపల్లి వైద్యులకు, ఆస్పత్రుల యాజమాన్యాల కు సూచించారు. తద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం వైద్యులు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్య తెలంగాణాయే ప్రభుత్వ లక్ష్యమనీ, అందు కోసం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వైద్యారోగ్యం, విద్యా అనేది ప్రభుత్వ ప్రాధాన్యతలని చెప్పారు. ఆ దిశలోనే ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీ రాకేష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.వీ. ప్రసాద్, వైస్ చైర్మన్ డాక్టర్ సీ.హెచ్. జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో వినోద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.