Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16న సీఎం కేసీఆర్‌కు ధన్యవాద సభ : ఎంపీ జి.సంతోశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హరిత విప్లవ స్ఫూర్తిదాత అని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ చైర్మెన్ జోగినపల్లి సంతోశ్‌కుమార్ కొనియాడారు. ఆయన న్యాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనను కలవాలంటే ఒక మొక్క నాటి రావాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఆయన ఆలోచనల మేరకు అందరూ మొక్కలు నాటి సంరక్షించాలనీ, హరిత భారతావనికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం నెలకొల్పటం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాద సభను ప్రజా, ఉద్యోగ, కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో దానికి సంబంధించిన పోస్టర్‌ను సంతోశ్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ సాగర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జలకాంతం, ప్రయివేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, డీఎన్టీ ఎమ్‌బీసీ, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ , టీపీయూఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు గంగాధర్ , వడ్డెర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, ఐటీ వింగ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవికుమార్ గుప్తా, ప్రయివేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్ నాయక్, ఓయూజేఏసీ నాయకులు డాక్టర్ సంజీవ్ నాయక్, శివకుమార్, నిపున్ రాజా తదితరులు పాల్గొన్నారు.