Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాంటి తల్లిని సంరక్షించుకునేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. బిడ్డ కడుపులో పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ , బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ , బాలింతలు, గర్భిణులకు పౌష్ఠికాహారం అందించేందుకు ఆరోగ్య లక్ష్మి , ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి సత్వర చికిత్స అందించేందుకు ఆరోగ్య మహిళ , వ్యాధి నిరోధకత పెంచేలా 100 శాతం ఇమ్యునైజేషన్, ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచిత ప్రయాణ సేవల కోసం అమ్మ ఒడి వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా 28 మాతా శిశు సంరక్షణ కేంద్రాలు.. ఇలా అనేక ఏర్పాట్లతో తల్లులను సంరంక్షించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. తద్వారా మాతృమరణాలను తగ్గించటంలో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇది తల్లులు, ఆడ బిడ్డల సంరక్షణ పట్ల కేసీఆర్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ది అని పేర్కొన్నారు. మాత ముర్తులందరికీ ప్రపంచ తల్లుల దినోత్సవం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.