Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ఓటమితో ఆ పార్టీ పతనం మొదలైంది: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్నాటకలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా దక్షిణ భారతదేశం మారిందని పీయూసీ చైర్మెన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమలనాథుల మత విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందని తెలిపారు. కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి పేద ప్రజల బతుకులను బలి చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ డ్రామాలకు శాశ్వతంగా తెరవేయడానికి కన్నడ ప్రజలు దేశానికే దిశానిర్దేశం చేశారని అభినందించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని తెలిపారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటు న్నాడనీ, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని పగటికలలు గంటు న్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేసినవి సిగ్గుమాలిన వ్యాఖ్యలని విమర్శించారు.