Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరపత్రం ఆవిష్కరణ
- బారీగా తరలిరండి :జర్నలిస్టులకు ఫెడరేషన్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం ఈనెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలం గాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఆది వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహాధర్నాకు సంబంధించిన కర పత్రాన్ని ఫెడరేషన్రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు గుడిగ రఘు, జి. విజయానంద్, జి.మాణిక్‌ప్రభు, హెచ్‌యూజే కార్యదర్శి బి. జగదీశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బివిన్ పద్మరాజు, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కల్యాణ్ చక్రవర్తి, నాయకులు రేణయ్య ఆవిష్కరించారు. గత 35 ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం పాత్రికేయులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప నేటి వరకు ఇండ్ల స్థలాలు కేటా యించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 వేల పైచిలుకు జర్నలిస్టులు ఉన్నారని గుర్తు చేశారు. మహా నగరంలో నాలుగువేల నుంచి ఐదువేల మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీలలో ఉన్న వారితోపాటు ఏ సొసైటీలోనూ సభ్యత్వం లేని వారికి సైతం ఇండ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలతోపాటు పాత్రికేయుల సమస్యలన్నింటిని ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లేందుకే ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులంతా వందలాదిగా ధర్నాలో పాల్గొని విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.