Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గీతం' కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కన్వకేషన్లో.. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
- యువత వల్లనే ఏదైనా సాధ్యం
- హైదరాబాద్‌ను త్రిబుల్ పీ ఫార్ములాతో అభివృద్ధి చేశా
- బాబు చేతుల మీదుగా పట్టాల ప్రదానం
నవతెలంగాణ-పటాన్చెరు
భారతదేశం 2047 నాటికి ఆర్థికంగా ప్రపంచంలోనే తొలి లేదా ద్వితీయ స్థానానికి చేరుకుంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ.. తొలి పట్టాల ప్రదానోత్సవ వేడుకను ఆదివారం గీతం యూనివర్సిటీ హైదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు హాజరై మాట్లాడారు. ఏదైనా సాధించాలనుకుంటే, దానిని దృశ్యమానం (విజువలెజ్డ్) చేసుకుని, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ, దాన్ని స్పష్టంగా అమలు చేయాలని సూచించారు.
తన దృష్టిలో 2047 నాటికి కార్పొరేట్ గవర్నెన్స్‌లో భారతీయులు ఆధిపత్యం చెలాయిస్తారని, పబ్లిక్ గవర్నెన్స్‌లో కూడా ఆధిపత్యం వహించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అమెరికా, ఐరోపాల్లో మధ్యతరగతి ఆదాయం ఎక్కువగా ఉన్నవారు ఉన్నారని, భవిష్యత్తులో అది భారత్ వైపు మళ్లుతుందన్నారు. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న భారత మధ్య తరగతి 2030 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. పబ్లిక్ పాలసీని రూపొందించడానికి ఇదో సదవకాశంగా యువతకు పిలుపునిచ్చారు. మన జనాభాకు సరైన విద్య, నైపుణ్యాలను ఇవ్వగలిగితే అద్భుతాలు చేయవచ్చన్నారు. యువత వల్లనే ఏదైనా సాధ్యమవుతుందని, కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టించాలని సూచించారు. తాను హైదరాబాద్‌ను త్రిబుల్ పీ ఫార్ములాతో అభివృద్ధి చేశానని, ఒక్క నయా పైసా వెచ్చించకుండా, ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ టవర్ నిర్మాణ బాధ్యతను కేవలం స్థలం ఇవ్వడం ద్వారా పబ్లిక్, ప్రయివేటు పార్టనర్షిస్ ఫార్ములాతో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తాను. ఫోర్ పీ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నానని, ప్రజలు, ప్రభుత్వం, ప్రయివేటు పార్టనర్షిప్తో పేద-ధనికుల మధ్య అంతరాన్ని కూడా నిర్మూలించవచ్చని ధీమా వెలిబుచ్చారు. అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ కాదన్నా జీనోమ్ వ్యాలీని 1500 ఎకరాల్లో శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అక్కడే ఉత్పత్తి అయిందన్నారు. అనంతరం గీతం అధ్యక్షులు ఎం.శ్రీ భరత్ తన అధ్యక్షోపన్యాసంలో పట్టభద్రులను అభినందించి, ముఖ్య అతిథి చంద్రబాబును సత్కరించారు.
కాగా, 43 మంది కేఎస్పీపీ విద్యార్థులకు పీజీ డిగ్రీ పట్టాలను అందించారు. కేఎస్పీపీ విద్యార్థి ప్రీతీష్ ఆనంద్‌కు బంగారు పతకాన్ని చంద్రబాబు బహుకరించారు. కేఎస్పీపీ విద్యార్థి సంయోగిత దిలీప్ సత్పుటే నేతృత్వంలో, గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ముఖ్య అతిథి నుంచి పట్టాను అందుకున్న వారి పేర్లను గీతం అకడమిక్స్ ప్రో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జయశంకర్ ఇ.వరియార్ ప్రకటించారు. కాగా, గీతం రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్ అధికారిక ధ్రువీకరణలపై కులపతి సంతకం తీసుకున్నారు. తమ పిల్లలను వత్తినిపుణులుగా తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులు కౌటిల్యా అధ్యాపక బృందానికి కతజ్ఞతలు తెలియజేశారు. కేఎసీపీ విద్యార్థి వసీం అహ్మద్ విద్యార్థులందరి తరఫున తన స్పందనను తెలుపగా, కౌటిల్యా డీన్ సయ్యద్ అక్బరుద్దీన్ అమూల్య సందేశాన్ని ఇచ్చారు. చివరగా, కౌటిల్యా సహ వ్యవస్థాపకులు ప్రతీక్ కున్వల్ వందన సమర్పణ చేశారు.