Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిటీ పొలీసులకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీ పొలీస్ స్టేషన్ పరిధిలో లాలాపేటకు చెందిన పాండు హత్య కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు ఎందుకు నమోదు చేయలేదని సిటీ పోలీసులను జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మెన్ డాక్టర్ అరణ్ హలార్ నిలదీశారు. సోమవారం హైదరాబాద్లోని దిల్ఖుష్ గెస్ట్ హౌస్లో పలు ఎస్సీ కేసులను విచారించారు. ఈ సందర్భంగా మొదటి కేసుగా పాండు హత్య కేసును దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు. కమిషన్ వైస్ చైర్మెన్ స్పందిస్తూ హత్య కేసులో ఎందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ఎస్సీ , ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయలాని ఆదేశించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.