Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వందేభారత్ రైళ్లలో బుధవారం నుంచి 16 కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ రైళ్లలో 16 కోచ్‌ల ఏర్పాటుతో మార్పు ఉంటుందని చెప్పారు. రైలు ప్రయాణంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సోమవారంనాడిక్కడి రైల్ నిలయం లో ఆయన జోన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అమృత్‌భారత్ స్టేషన్ స్కీం ద్వారా చేపడుతున్న రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పనుల పేరుతో రైళ్ల వేగాన్ని తగ్గించకుండా సాధ్యమైనన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.