Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యా.. మిస్‌ఫైరా..పోలీసుల దర్యాప్తు
- పరిస్థితి విషమమే: వైద్యులు
నవతెలంగాణ-చందంపేట
ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారని కానిస్టేబుల్ తన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండల పోలీస్ స్టేషన్లో జరిగింది. పిఏపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన వెంకటయ్య (పి.సినెంబర్ 1566) 2013లో పోలీస్ ఉద్యోగంలో చేరి చందంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన వెంకటయ్య వివాహం మేనమామ కూతురుతో నిశ్చయించారు. అయితే, ఈ పెండ్లి ఆయనకు ఇష్టం లేదని తెలిసింది.
ఇష్టంలేని పెండ్లి చేస్తున్నారన్న మనస్తాపంతో మంగళవారం స్టేషన్లోనే వెంకటయ్య తన గన్‌తో ఛాతి కింది భాగంలో కాల్చుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు ఆయన్ను వెంటనే హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నారు. అయితే డ్యూటీ సమయంలో గన్ మిస్‌ఫైర్ అయ్యిందా లేక ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.