Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్ కోర్సుల్లో చేరేందుకు గడువు పెంచినట్టు సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఈనెల 21లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17వరకు గడువు ఉండగా, అభ్యర్థుల కోరిక మేరకు 21 వరకు పొడగించారు.