Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయ విస్తరణ పనుల పరిశీలన
నవతెలంగాణ-యాదాద్రిభువనగిరి ప్రతినిధి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఇందు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఈ ప్రదేశాన్ని ఇంటలిజెన్స్ ఐజీ ఎంకె సింగ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి రాచకొండ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషికి వివరించారు. సుమారు 500 మందికి పైగా పోలీసులు సీఎం బందోబస్తులో పాల్గొంటారని డీసీపీ రామచంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ యాదాద్రి జిల్లాకు రావటం ఇది తొమ్మిదోసారి. గుట్టలో గంటా 40 నిమిషాల పాటు ఉంటారని అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు. 10.15 గంటలకు భువనగిరి మండలం వడాయిగూడెం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వారులో బయలుదేరి 10.25కు యాదాద్రి కొండపైకి చేరుకుంటారు. 35 నిమిషాలపాటు కొండపైన ఉంటారు. బాలాలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో అతిముఖ్యమైన ప్రాకారాలు, రాజగోపురాలు, శ్రీమత్ రామానుజుల ఆలయంతోపాటు గోదా అమ్మవారు, ఆళ్వార్ల ఆలయాల డిజైన్లను, ఆల్వార్ స్వాముల ప్రతిష్ట తదితర పనులను పరిశీలిస్తారు. అలాగే ప్రధానాలయ మహామంటపంలోని కాకతీయ ఫిల్లర్ల పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాన్వారులో బయలుదేరి యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెంలోని సాయి ఫంక్షన్ హాల్‌కు 11.10గంటలకు చేరుకు ంటారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు వివాహానికి హాజర వుతారు. తరువాత 11.15కు అక్కడి నుంచి బయలు దేరి 11.20కి పెద్దగుట్టకు చేరుకుంటారు. అక్కడ టెంపుల్ సిటీ మొదటి ఫేజ్ పనులను పర్యవేక్షిస్తారు. యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. అక్కడి నుంచి నేరుగా కాన్వారులో హెలిప్యాడ్ వద్దకు 11.55 గంటలకు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. యాదగిరిగుట్ట పట్టణంలో సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు విధించారు. అలాగే కొండపైన దర్శన వేళలను మార్చినట్టు దేవస్థానం ఈవో గీతారెడ్డి ప్రకటించారు. సీఎం రాక సందర్భంగా వైటీడీఏ ఉపాధ్యక్షులు కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు.