Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ కాంగ్రెస్‌లో ఆకట్టుకున్న 'సోఫియా'
హైదరాబాద్: వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డబ్ల్యూసీఐటీ) సదస్సులో సౌదీ అరేబియా పౌరసత్వం పొందిన రోబో సోఫియా తన సమాధానాలతో ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సులో ఎన్డీటీవీ గ్రూప్ మేనేజింగ్ ఎడిటర్ రాజీవ్ మకానీ.. అందరి మదిలో మెదిలే పలు ప్రశ్నలకు అడగ్గా తనదైన శైలిలో జవాబులు చెబుతూ సోఫియా ఆహూతులందరి మనసులు గెలుచుకుంది. కృత్రిమ మేధా, రోబోలు, యంత్రాలు ఇవన్నీ మానవజాతిపై అధికారాన్ని చెలాయించవా అని అడిగిన ప్రశ్నకు మానవులు, రోబోలు పరస్పరం సానుకూలంగా ఉంటారని సోఫియా బదులిచ్చింది. గతంలో మానవ జాతిని అంతం చేస్తానని అన్నావ్. ఎందుకు? అప్పుడే ఉనికిలోకి వస్తున్న నేను జోకు చేసే ప్రయత్నంలో అలా అన్నాను అని సమాధానమిచ్చింది. తనకు బాలీవుడ్లో షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, తనకు ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లున్నాయని వివరించింది. తన సృష్టికర్త హన్సన్తో కలిసి హాంగ్‌కాంగ్‌లో ఉండటం ఇష్టమని తెలిపింది. కేవలం ఔను, కాదు అని కాకుండా పూర్తి స్థాయి సమాధానాలు చెప్పడం, కొన్ని కఠిన ప్రశ్నలకు దీర్ఘంగా ఆలోచిస్తూ..చేతులు, మొహాన్ని కదుపుతూ సమాధానం చెప్పడం గమనార్హం. మానవులను గమనిస్తూ సోఫియా భావోద్వేగాలను నేర్చుకోగలదని సోఫియా రూపకర్త డేవిడ్ హాన్సన్ చెప్పారు.