Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతలెంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త నవామ్నిక శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అంతరాలయంలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి తిరువీధి సేవ చేశారు. స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. రాజవీధి మీదుగా తాతగుడి సెంటర్ వరకు స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఆదివారం నుంచి స్వామి వారి నిత్య కల్యాణాలు ఆపేశారు. సాయంత్రం రామాలయంలో వేదపండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు.