Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్లూరు
తండ్రి వయసున్న దుర్మార్గుడు మద్యం మత్తులో బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక హైదరాబాద్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటోంది. బాలిక తల్లిదండ్రులిద్దరూ చిన్నతనంలోనే చనిపోయారు. వేసవి సెలవులకు చిన్నకోరుకొండిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.
వాళ్ల ఇంటి పక్కనే ఉండే మాడుగుల కృష్ణ(40) ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లింది. ఆ సమయంలో అతని భార్య బయటికి వెళ్లడంతో మద్యం మత్తులో ఉన్న కృష్ణ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి లైంగిక దాడి చేశాడు. తర్వాత బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగా, దుర్మార్గుడు పరారయ్యాడు. దీనిపై బాలిక అమ్మమ్మ-తాతయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పవన్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి బాలికను పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ మడతా రమేష్, ఏసీపి బల్లా రాజేష్ గ్రామంలో వివరాలు తెలుసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.