Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జూబ్లీహిల్స్
కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి పెద్ద కుమారుడు నాగం దినకర్ రెడ్డి (45) గురువారం మృతి చెందారు. దినకర్ రెడ్డి మూడు నెలలుగా నిమోనియా, ఆయాసంతో బాధ పడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడంతో మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతిచెందారు. దినకర్‌రెడ్డి మృతి చెందిన వార్త తెలియగానే వారి బంధువులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.