Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ నిర్ణయం
- తెలంగాణకు రెండవ హోం మంత్రి
మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. రాష్ట్ర హోం మంత్రిగా నియమితులయ్యారు. ఆయన్ను ఆ పదవికి ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మహమూద్ అలీ గురువారం మధ్యాహ్నం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను హోం మంత్రిగా నియమిస్తూ సీఎం నిర్ణయించటం గమనార్హం. దీంతో తెలంగాణ రెండో హోం మంత్రిగా మహమూద్ అలీ నిలిచిపోనున్నారు. రాష్ట్ర తొలి హోం మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి సేవలందించిన సంగతి విదితమే.