Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్‌మీడియాలో కానిస్టేబుల్ వీడియో
నవతెలంగాణ-పెన్‌పహాడ్
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తనను ఎస్సై రంజిత్‌రెడ్డి వేధిస్తున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో ఆదివారం పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో కానిస్టేబుల్ రమేష్ మాట్లాడుతూ.. తనకు బీపీ ఉండడంతో డాక్టర్‌ను సంప్రదిం చగా ఆయన సలహా మేరకు సిక్ లీవ్ పెట్టానని తెలిపారు. విధులకు రావడం లేదని తన జీతం ఎస్ఐ ఆపించాడన్నారు. ఎండాకాలం అయినందున తాను అనా రోగ్యం రీత్యా విధులు నిర్వహించలేనందునే సెలవు పెట్టాననీ, ఈ విష యం అందరికీ తెలుసుననీ అన్నారు. తనను కావాలనే ఎస్ఐ టార్గెట్ చేశారని వాపో యారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరా రు. దీనిపై ఎస్సై రంజిత్‌రెడ్డిని వివరణ కోరగా సదరు కానిస్టేబుల్ విధులు సక్రమం గా నిర్వహించే వారు కాదనీ, ఇటీవల రెండురోజులు సిక్‌లీవ్ పెట్టగా దానిని డీపీ ఓకి తెలిపానన్నారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు తెలిపారు.