Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకడమిక్ డైరెక్టర్ సీమ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిష్టాత్మకమైన అమెరికా నాసా ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ (ఐఎస్డీసీ) ప్రపంచ చాంపియన్గా శ్రీచైతన్య నిలిచి రికార్డు నెలకొ ల్పిందని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సీమ అన్నారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాసా ఐఎస్డీసీ చరిత్రలో శ్రీచైతన్య విద్యార్థులు సంచలన విజయం నమోదు చేశారని చెప్పారు. ఐఎస్డీసీకి ప్రపంచ వ్యాప్తంగా 350 మంది విద్యార్థులు ఎంపికైతే భారతదేశం నుంచి 210 మంది వెళ్లారని అన్నారు.