Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే టీఆర్ఎస్కు రాజీనామా చేస్తాం..: రాయికల్ మండల సర్పంచుల ఫోరం నిరసన
నవతెలంగాణ-రాయికల్
సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పించే గెజిట్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని జగిత్యాల జిల్లా రాయికల్ మండల సర్పంచుల ఫోరం డిమాండ్ చేసింది. రాయికల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాత పద్ధతిలోనే గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శికి ఉమ్మడి చెక్‌పవర్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఉమ్మడి చెక్‌పవర్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే టీఆర్ఎస్లో ఉన్న సర్పంచ్‌లు, పార్టీ పదవులకు టీఆర్ఎస్కు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి చెక్‌పవర్ వల్ల గ్రామాల్లో రాజకీయ గ్రూపుపోరు ఏర్పడి అభివద్ధి కుంటుపడుతుందని వాపోయారు. గ్రామాభివద్ధికి సర్వం అధికారులు, సర్పంచ్ అని చెప్తున్న పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్, ఉపసర్పంచులకు చెక్‌పవర్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు.