Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను కవిని..
కల్పన, వర్ణన నా నైజం.
గడవని చీకటి రాత్రుల్లో
కన్నీరు సంద్రమై పొంగుతొంటే
మదిలోతుల భావాలకు శిల్ప రమణీయత నద్ది,
వర్ణశోభిత అక్షర ప్రతిమనై ఒదిగిపోతాను.
ఒత్తిడికి గురైన వేళ రాలిన ఆత్మవిశ్వాస శిశిరాన్ని
కిసలయాక్షరాలతోజి వసంతంగా మారుస్తాను.
విశ్వాంతరాళాలలోని
అణువణువు స్పందనల గాధను
ఆర్ద్రంగా స్పశించి, అద్భుత అక్షరమాలికగా కూర్చుతాను.
అణగారిన చరితల బతుకు సీమను
అనునిత్యం సజియిస్తూ,
చేతనా ఉషస్సులు పూయిస్తూ,
తిరుగుబాటు గొంతుకల్లో
విప్లవశంఖం పూరించే కంఠానౌతాను.
కోయిలకు ఏడాదికి
ఒక్కవసంతం మాత్రమే...
కానీ, నేను మాత్రం
కాలచక్రపు కదలికలకు
స్పందిస్తూ,ప్రతిస్పందిస్తూ
భూతభవిష్యత్ వర్తమానాలలో
పరిభ్రమిస్తూ, కవితాలాపన చేస్తూనే ఉంటాను.
కలాన్ని స్పశించని దినం
దిగులు గడప గడియపడి,
గడవని గడియ గుదిబండౌతుంది.
అందుకే ఎన్ని అవాంతరాలు
ముళ్లదారిలా కప్పినా
కవితావక్షాన్నై భావాల ఫలాలు పండిస్తూ ఉంటా!
సాదాసీదా మధ్యతరగతి జీవితాన
నాకో అస్తిత్వాన్నిచ్చి,
సమాజంలో నన్ను ప్రత్యేకంగా నిలిపిన
కవిత్వమంటే నాకు చాలా ఇష్టం.
నేను కవిని.
- వేమూరి శ్రీనివాస్,
9912128967