Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లాక్డౌన్ విధించడంతో చాలా కాలంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు మూతపడ్డాయి. ఇటీవలే భారత విమానయాన కంపెనీలు అంతర్జాతీయ విమానాలను కొన్ని మార్గదర్శకాల మేరకు నడుపుతుండగా.. తాజాగా స్పైస్‌జెట్ కూడా సిద్ధమైంది. లండన్ హీత్రో విమానాశ్రయానికి వెళ్లేందుకు స్పైస్ జెట్ కు అనుమతి లభించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి లండన్‌కు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు స్పైస్ జెట్ కసరత్తు చేస్తోంది. హీత్రో విమానాశ్రయం నుంచి తమకు స్లాట్లు వచ్చాయని స్పైస్ జెట్ వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలు ప్రారంభమైన తర్వాత భవిష్యత్తులో విస్తరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.