Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభావవంతమైన ప్రాంతీయ నేతలు ప్రజల ప్రాథమిక సమస్యలను తెరపైకి తీసుకురాగలిగి నట్లైతే మోడీ అయినా ఓడిపోక తప్పదని కర్ణాటకలో బిజెపి ఓటమి రుజువు చేసింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాలు గెలుచు కుని తిరుగులేని విజయాన్ని సాధించింది. కేవలం 65స్థానాలకే బిజెపి పరిమితమమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉదయమే ఓటమిని అంగీకరించారు. ''స్వయంగా ప్రధాని మోడీ, బిజెపి కార్యకర్తలు తీవ్రంగా కృషి చేసినా, మేం కనీసం సగం సీట్లను కూడా సాధించలేకపో యాం. ఈ ఫలితాలపై కచ్చితంగా సవివరమైన విశ్లేషణ చేయాలి.'' అని బొమ్మై వ్యాఖ్యానించారు.
పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత
కర్ణాటకలో బిజెపి నుండి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ముందు నుంచే చాలా మంది భావించారు. అయితే, ఇక్కడ దీని జాతీయ పర్యవసానాలు మరింత కీలకం కానున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల కొరకు జరిగే ఎన్నికల ప్రచారాన్ని కర్ణాటక ఫలితాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి అవిశ్రాంతంగా ప్రచారం చేసి పాటు పడినప్పటికీ, ముంచుకొస్తున్న వ్యతిరేకతను అధిగమించలేకపోయారు. పలుసార్లు రోడ్ షోలు నిర్వహించడం ద్వారా మోడీ తమ పార్టీకి ఎక్కువ ఓట్లు తీసుకువస్తారని బిజెపి గట్టిగా నమ్మింది. కానీ అందుకు విరుద్ధంగా దేశం దిగ్భ్రాంతితో చూస్తుండగా, ఆ ఎన్నికల ప్రచారం హనుమాన్ను బజరంగ్‌దళ్‌తో సమాన పరిచే స్థాయికి దిగజారిపోయింది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో 'జై బజరంగ్దళ్' అని నినదించాలంటూ మోడీ ఓటర్లకు ఉద్భోదించారు. వాస్తవానికి, ఈనాటికీ కర్ణాటకలో బిజెపికి భారీగానే ఓటు వాటా వుంది. కానీ నిర్ణయాత్మకమైన ప్రజా తీర్పును కాంగ్రెస్ గెలుచుకుంది.
మతపరమైన నినాదాలతో ఫలితం లేదు
బిజెపికి ఓట్లు రాబట్టడానికి మోడీ లేవనెత్తిన మతపరమైన నినాదం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, 1951నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించింది. రాజకీయ నేతలు, పార్టీలు మతం పేరుతో ఓట్లు అడగడాన్ని ఆ నిబంధనలు నిషేధిస్తున్నాయి. కానీ, మోడీ మతపరమైన నినాదాలు లేవనెత్తడానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై భారత ఎన్నికల కమిషన్ నిష్క్రియాపరత్వంతో, చెవిటివాని ముందు శంఖం ఊదిన తరహాలో వ్యవహరించడం చాలా ఆందోళన కలిగిస్తోంది, కలవరపాటుకు గురిచేస్తోంది.
మోడీ పదే పదే 'జై బజరంగ్ దళ్' నినాదాన్ని ఉచ్ఛ రించడమంటే మతాన్ని, రాజకీయాలతో ముడిపెట్టినట్లే. ఇది చట్టానికి, లౌకికవాదానికి పూర్తి విరుద్ధ, దారుణమైన చర్య.
'బొమ్మై ప్రభుత్వానికి మరో అవకాశాన్ని ఇవ్వరాదు'' అని 67శాతం మంది ఓటర్లు అభిప్రాయపడినట్లు ఎడినా పోల్ సర్వే వెల్ల డించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఇది బలంగా ప్రతి బింబి స్తోంది. ముఖ్యమం త్రిని కూడా పక్కకు నెట్టే సేలా, బి.ఎస్. యడ్యూరప్ప వంటి ప్రధాన నేతలకు కూడా తగిన ప్రాముఖ్యత ఇవ్వ కుండా మోడీ ప్రధానంగా సాగిన ప్రచారం విఫలమైందని ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
బిజెపి ఓటమి వెనుక గల అత్యంత ప్రధానమైన కార ణాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు ఒకటనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంట్రాక్టర్ల నుం డి 40శాతం ముడుపులు తీసు కున్న ప్రభావం బొమ్మై ప్ర భుత్వాన్ని చాలా బలంగా దెబ్బ కొట్టింది. ఈ కార ణాలకు తోడు పెరుగు తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇవన్నీ కలిసి ప్రభుత్వ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి.
కాంగ్రెస్, నెహ్రూ దార్శనికతకు మహిళల మద్దతు
కాంగ్రెస్ ఎదుగుదల వెనుక గల కారణాల్లో మహిళల మద్దతు ఒకటిగా వుంది. బిజెపి కన్నా కాంగ్రెస్‌కే ప్రాధాన్యతనివ్వాలని 40శాతం మంది మహిళా ఓటర్లు భావించినట్లు ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. మహిళల మద్దతును పొందడంలో బిజెపికి ఆరు పాయింట్లు వస్తే కాంగ్రెస్‌కు 11పాయింట్లు వచ్చాయని ఆ ఎగ్జిట్ పోల్ తెలిపింది.
ఎన్నికలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే వ్యక్తి, స్వరాజ్ ఇండియా సహ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ విశ్లేషణ ప్రకారం, కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్‌లో ప్రజలకు చేసిన పలు వాగ్దానాల్లో - మహిళలు కుటుంబ పెద్దగా వున్న కుటుంబాలకు నెలవారీ రూ.2వేలు, అన్న భాగ్య యోజన కింద ప్రతి కుటుంబ సభ్యుడికి 10కిలోల బియ్యం వంటివి మహిళల మద్దతుకు ప్రధాన కారణంగా మారాయి. వీటికి తోడు, మహిళలకు బస్సు ప్రయాణాలు ఉచితం చేస్తామని పార్టీ ఇచ్చిన హామీ కూడా ఆ పార్టీకి అదనంగా ఓట్లను సమీకరించి పెట్టింది. అనేక ఏండ్లుగా దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించు కోవడం సర్వ సాధారణంగా మారింది. భారత రాజకీయాల డైనమిక్స్ ను, కర్ణాటక లో కాంగ్రెస్ ఆవిర్భావాన్ని అర్ధం చేసు కోవాలంటే ఈ నిర్లక్ష్యం చేయబడిన, ఎన్నికల ప్రజా స్వామ్యంలో లింగ అంశా న్ని నిర్వచిస్తున్న కోణాన్ని లోతుగా విశ్లే షించాల్సిన అవసరం వుంది.
1952 సార్వ త్రిక ఎన్నికల తర్వా త, అదే ఏడాది మే 18న రాష్ట్రాల ముఖ్య మంత్రులకు లేఖ రాస్తూ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,లోక్‌సభ, రాజ్యసభలకు కేవలం అతి కొద్దిమంది మహిళ లు మాత్రమే ఎన్నిక య్యారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.''ప్రజా జీవితం లో మహిళలు వారి వంతు పాత్రను పోషిం చడానికి పూర్తి అవకాశం వచ్చిన పుడే మనకు వాస్త వికమైన, మౌలిక పురోగతి వస్తుందని నేను కచ్చితంగా చెబుతున్నా. '' అని ఆయన ఆ లేఖ లో పేర్కొన్నారు. ''ఎక్కడ వారికి ఈ అవ కాశం వచ్చినా, వారు సగటు పు రుషుని కన్నా బాగా వ్యవహరించగలరని నేను చెప్పగలను.'' అని ఆయన పేర్కొన్నారు.
'' పురుషుల కన్నా మహళలపైనే బహుశా భారతదేశ భవితవ్యం ఎక్కువగా ఆధారపడవు'' అని నెహ్రూ ఉద్ఘాటించారు. 1953 సెప్టెంబరు 20న ముఖ్యమంత్రుల కు రాసిన మరో లేఖలో కూడా ఆయన ఇదే వైఖరి పున రుద్ఘాటించారు. ''భారతీయ స్త్రీత్వం ప్రమాణాలు చాలా ఉన్నతంగా వుంటాయి. భారతీయ మహిళలు, పురుషుల కన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారు. ఏ దేశమైనా మహిళలకు పూర్తి స్థాయి అవకాశాలు ఇవ్వకపోతే ముందుకు వెళ్ళలేదు.'' అని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారు.
అందుకు తగినట్టుగానే అనేక అంశాల్లో మహిళలకు వారి రోజువారీ జీవితాలను ప్రభావితం చేయగల హామీలు ఇచ్చింది కాంగ్రెస్. ఇవన్నీ కూడా కాంగ్రెస్ విజయం సాధిం చడం వెనుక నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. కర్ణాటకలో ఈ యాత్ర సాగిన సమయంలో వారి ఆందోళనలపై రాహుల్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
కుప్పకూలిన హిందూత్వ వ్యూహం
హిజాబ్, హలాల్ మాంసం, అజాన్, కర్ణాటక పశు వధ నివారణ చట్టం, 2020, రాష్ట్ర జనాభాలో 12 నుండి 14 శాతంగా వున్న ముస్లింలను సామాజికంగా, ఆర్థికంగా బహి ష్కరించాలన్న పిలుపు వీటి చుట్టూ తిరిగిన బిజెపి హిందూ త్వ వ్యూహం కర్ణాటకలో పూర్తిగా కుప్పకూలి పోయింది. పార్టీ ఓటమికి ఇదొక ముఖ్యమైన కారణంగా వుంది.
బజరంగ్ దళ్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన తర్వాత, మోడీ జై బజరంగ్ దళ్ నినాదాన్ని ఇవ్వడం పార్టీకి అనుకూలంగా పరిస్థితి మారుస్తుందనే ఆశ కల్పించింది. కానీ ప్రభావవంతులైన ప్రాంతీయ నేతలు ప్రజల ప్రాధమిక సమస్యలపై గళమెత్తితే మోడీ అయినా ఓడిపోక తప్పదని బిజెపి ఓటమి రుజువు చేసింది. హిందూత్వ మరియు సంకుచిత జాతీయవాదం పేరుతో మోసగించడం, దీనికి తోడు దూకుడుతో కూడిన మెజారిటీవాదాన్ని అనుసరించడం కూడా ఓటమికి కారణాలయ్యాయి.
మెజారిటీవాదం ఓటమి
కర్ణాటకలో దాదాపు 35శాతం ఓటు వున్నా, బిజెపి మెజారిటీవాదం రాష్ట్రంలో ఓడిపోయింది. ఈ మెజారిటీ వాదాన్ని ఓడించడంలో కర్ణాటక మహిళలు గణనీయమైన పాత్ర పోషించారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా ప్రతి బింబించాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అర్ధం ఇది. భారతదేశ ఆలోచనను రక్షించడంలో ఈ ఫలితాలు చారిత్రక ప్రాధాన్యతను కలిగి వున్నాయి.
కింది స్థాయి ఓటర్లతో కాంగ్రెస్ సంబంధాలు
అట్టహాసంగా, ఆడంబరంగా రోడ్ షోలతో మోడీ ఒకపక్క ఉధృతంగా ప్రచారం సాగిస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలు అట్టడుగు స్థాయిలోని ఓటర్లను కలిశారు, వారి బాధలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అనుసరించిన కీలకమైన వ్యూహాల్లో ఇదొకటిగా వుంది. డెలివరీ బారు స్కూటర్ వెనకాల ఎక్కి రాహుల్ గాంధీ దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయా ణించిన తీరు ప్రజలతో ఆయన అనుబంధం ఎంతలా పెనవేసుకుపోయిందో స్పష్టం చేసింది. వీటికి అద నంగా ధరల పెరుగుదల, అవినీతి, పాలన పూర్తిగా కుప్పకూలడం వంటి అంశాలు తోడయ్యాయి.