Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ ఇన్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ ఇన్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం పారిస్‌లో ప్రారంభమైంది. దేశంలోని వ్యవసాయ కార్మికులు, రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూ యూ) అధ్యక్షుడు ఎ. విజయరాఘవన్, అఖిల భారత కిసాన్‌సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణ న్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. యూనియన్ ఉపాధ్యక్షు డుగా ఉన్న విజూ కృష్ణన్ ఏఐకేఎస్‌కు ప్రాతి నిథ్యం వహిస్తూ సమావేశంలో ప్రసంగించారు. ఫ్రాన్స్, ఇత ర చోట్ల కార్మికులు, కర్షకుల పోరాటాలకు సంఘీ భావం తెలిపారు. ఏప్రిల్ 4న కన్నుమూసిన ఏఐఏడ బ్ల్యూయూ మాజీ కార్యవర్గ సభ్యుడు సునీత్ చోప్రాకు నివాళులర్పిస్తూ సమావేశం ప్రారంభ మైంది.
కార్యనిర్వాహక కమిటీ సమావేశం ప్రపంచ రాజకీయ దృశ్యాలు, కార్మికులు, రైతులపై దాడులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య మరింత సంఘీభావం గురించి చర్చించింది. నవంబర్‌లో ఈజిప్ట్‌లోని కైరోలో జరగనున్న 5వ అంతర్జాతీయ సమావేశానికి సన్నాహకంగా ఈ కమిటీ సమావేశం నిర్వహించబడింది. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఐక్య పోరాటంలో విజయం సాధించినందుకు రైతులు, కార్మికులను సమావేశం అభినందించింది. ఈ సమావేశం క్యూబా, పాలస్తీనాపై సామ్రాజ్యవాద, జియోనిస్ట్ హింసను ఖండించింది, ఆ దేశాల ధైర్యవంతులకు సంఘీ భావం తెలిపింది.