Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల జీవనోపాధిని కాపాడాలి
- పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి
- ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించుకోవాలి
- అసంఘటిత రవాణా కార్మికులకు సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించాలి
- మోటర్ వెహికల్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి: రోడ్డు రవాణ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ జాతీయ కన్వెన్షన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో రవాణా రంగాన్ని రక్షించటంతో పాటు కార్మికుల జీవనోపాధిని కాపాడాలని ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఆర్గనైజేషన్స్ నేషనల్ కన్వెన్షన్ పిలుపు ఇచ్చింది. ఈ కన్వెన్షన్ ఆదివారం సీఐటీయూ కేంద్ర కార్యాలయం (బీటీఆర్ భవన్)లో జరిగింది. కె.కె.దివాకరన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్), ధర్మవీర్ చౌదరి (ఎన్ఎఫ్ఐఆర్టీడబ్ల్యూ), జయరాజన్ (ఏఐసీసీటీయూ), నాగరాజన్ (టీటీఎస్ఎఫ్)లు కన్వెన్షన్‌కు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.
ఎన్ఎఫ్ఐఆర్టీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి నిర్మల్ సింగ్ ధాలివాల్, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య, ఏఐసీసీటీయూ నేత ఎస్.కె.రారు, టీటీఎస్ఎఫ్ నేత సంపత్ కన్వెన్షన్‌లో మాట్లాడారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నేత ఆర్. లక్ష్మయ్య ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌ను కన్వెన్షన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సుకు అతిథిగా హాజరైన సీఐటీయూ కార్యదర్శి ఆర్.కరుమ్లైయన్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు గిరి ప్రసంగించారు.
కన్వెన్షన్ నిర్ణయాలు
జూన్, జూలై నెలలో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాలని కన్వెన్షన్ పిలుపు ఇచ్చింది. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న క్రూరమైన విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపు నిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రవాణా కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చింది. సెప్టెంబర్ రెండో వారంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ప్రదర్శనలు జరపాలని, రాష్ట్ర స్థాయిలో సమ న్వయ కమిటీ నాయకత్వం సమావేశమై కార్యక్రమం విజయ వంతం చేయాలని పిలుపు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రోడ్డు రవాణా కార్మికులందరూ పాల్గొని కార్యాచరణ ప్రణా ళికను విజయవంతం చేయాలని సదస్సు విజ్ఞప్తి చేసింది.
డిమాండ్లు
- డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించు కోవాలి. 2020 జూన్ 7న ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలను వెనక్కి తీసుకోవాలి.
- రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని సక్రమంగా భర్తీ చేస్తూ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ఉపాధి పొందుతున్న వారికి కొత్త వాహనాల కొనుగోలు కోసం జాతీయ బ్యాంకుల ద్వారా రుణం ఇచ్చే ఏర్పాట్లు చేయాలి.
- ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీల వేధింపులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి.
- బీమా ప్రీమియంలను నియంత్రించాలి. ప్రీమియం రేట్లను నిర్ణయించడంలో పారదర్శకత పాటించాలి.
- అపాయింట్మెంట్ లెటర్స్, చట్టాల వర్తింపు కోసం వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ సిఫారసులను సక్రమంగా అమలు చేస్తూ అసంఘటిత రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించండి.
- సవరించిన మోటర్ వెహికల్ చట్టాన్ని ఉపసంహరించు కోవాలి. మెరుగైన, సరైన ప్రత్యామ్నాయ విధానం కోసం భాగస్వామ్య పక్షాలతో చర్చించాలి.
- కార్మిక వర్గ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి
- స్వయం ఉపాధితో సహా అసంఘటిత రోడ్డు రవాణా కార్మికులందరూ కార్మిక శాఖ రిజిస్టర్లలో నమోదు చేయాలి.
- స్వయం ఉపాధితో సహా అసంఘటిత రోడ్డు రవాణా కార్మికులందరూ అన్ని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. అందుకనుగుణంగా తగిన సవరణలు చేయాలి.
- పోలీసులు, ఇతర అధికారుల వేధింపులను తక్షణమే ఆపాలి.
- ఉబర్, ఓలా వంటి యాప్ ఆధారిత కంపెనీల్లో పని చేసే డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాలి. అందుకను గుణంగా మోటర్ వెహికిల్ చట్టం, ఎంటీడబ్ల్యూ చట్టంలో సవరణలు చేయాలి.
- కాంట్రాక్టర్ల ద్వారా ఆయిల్ ట్యాంకర్లపై పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ మొదలైనవి చెల్లించాలి. ఆయిల్ కంపెనీలు అమలుకు బాధ్యత వహించాలి. కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఈ నిబంధన చేర్చాలి.
- డ్రైవర్ వృత్తిని గౌరవంగా చూడాలి.
- బడ్జెట్‌ను కేటాయించడంతో రాష్ట్రాల్లో ఉండే ఆర్టీసిలను బలోపేతం చేయాలి. విస్తరించాలి.
- 1:2 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్టీసీలకు మూలధన సహకారం పునరుద్ధరించాలి. ఈ ప్రయో జనం కోసం వివిధ దేశాలలో చేస్తున్న విధంగా నిధుల ను సమీకరించడానికి తగిన పద్ధతులు అనుసరించాలి.
- దేశంలోని అన్ని ఆర్టీసిలకు పేరుకుపోయిన అప్పులను ప్రభుత్వాలు వన్-టైమ్ సెటిల్మెంట్తో ఈక్విటీగా మార్చాలి.
- లక్ష బస్సులను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, వన్ టైమ్ సెటిల్మెంట్గా దామాషా ప్రాతిపదికన అన్ని ఆర్టీసిలకు పంపిణీ చేయాలి.
- ఎక్సైజ్ డ్యూటీ, డీజిల్, ఛాసిస్, స్పేర్స్, ఫ్యాబ్రికేషన్ మొదలైన వాటిపై సేల్స్ టాక్స్ నుంచి ఆర్టీసిలను మినహాయించాలి.
- ఎఫ్ఎఎంఈ ×, ×× కింద ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలతో మాత్రమే సేకరించాలి. నిర్వహించాలి.
- ఆర్టీసీలకు ''లాభం, నష్టం'' స్కేల్లో కొలవకూడదు.
- ప్రయివేట్ ఆపరేటర్ల అక్రమ కార్యకలాపాలను వెంటనే ఆపాలి. ఎంవి యాక్ట్‌కు అవసరమైన సవరణలు తీసుకురావాలి.
- అర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ చట్టం 1950లోని సెక్షన్ 19(1)(సి)లో నిర్దేశించిన విధంగా న్యాయమైన వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ ఏర్పాటు, నివాసం, విశ్రాంతి కోసం స్థలాలు, వినోదం ఇతర సౌకర్యాలతో సహా తగిన సేవా పరిస్థితులు అందించాలి.
- ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ పథకానికి అర్హులు కావాలి.
- ఆర్టీసీ కార్మికులను కూడా కోవిడ్-19 వారియర్స్‌గా పరిగణించాలి. 50 లక్షల బీమా, ఇతర ప్రయోజనాలు ఇవ్వాలి.
- ఆర్టీసీలు ఉత్తమ నిర్వహణ పద్ధతులను ఏర్పరచు కున్నందున, వారి స్వంత స్క్రాపింగ్ విధానాలను అవలంబించినందున బస్సులను స్క్రాప్ చేయడం తప్పనిసరి చేయకూడదు.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలైన ప్రాంతాల్లో జరుగు తున్న విధంగా అదనపు ఆదాయాన్ని సంపాదించ డానికి గూడ్స్ రవాణాను చేపట్టేందుకు అన్ని ఆర్టీసీలకు అనుమతి ఇవ్వాలి.
- పెట్రోలు, డీజిల్ అవుట్ లెట్ డీలర్ షిప్ అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఆర్టీసీలకు మంజూరు చేయాలి.