Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అత్యుత్తమ వనరులను అందించడంతో పాటుగా ఆంగ్ల అభ్యాసం మరియు బోధనా అనుభవాలను వృద్ధి చేయాలనే తమ లక్ష్యంలో భాగంగా ప్రపంచపు అభ్యాస కంపెనీ పియర్సన్ నేడు తాజా సిరీస్ లాంగ్మన్ ఇంగ్లీష్ డిక్షనరీని ఆవిష్కరించింది. ఇది వైవిధ్యమైన విద్యార్థులు మరియు వారి అవసరాలను తీర్చనుంది. ఈ నూతన జోడింపులు సమగ్రమైన మరియు అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన మరియు ఆధునీకరించిన సమాచార సంకలనాన్ని విద్యార్థుల స్థాయిని అనుసరించి అందిస్తుంది. ఈ డిక్షనరీలు వినియోగించేందుకు అతి సులభంగా ఉండటంతో పాటుగా అర్థం చేసుకోవడమూ సులభం. వీటికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉండటంతో పాటుగా సందర్భోచితం మరియు వివరణాత్మక ఉదాహరణలను ప్రాధమిక మరియు జూనియర్ స్థాయి అభ్యాసకులకు అందించడం ద్వారా భాషా నైపుణ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు వారికి ఆసక్తిని కలిగిస్తూనే అడ్వాన్స్డ్ అభ్యాసకుల కోసం భాషను మరింత లోతుగా అర్ధం చేసుకునే అవకాశమూ కలిగిస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి రాజేష్ పంకజాక్షన్, డైరెక్టర్– ప్రొడక్ట్, పియర్సన్ ఇండియా మాట్లాడుతూ ‘‘నేటి అంతర్జాతీయ పని వాతావరణపు ప్రపంచంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యత అనేది అత్యంత కీలకంగా మారింది మరియు గత కొద్ది సంవత్సరాలుగా దీని ప్రాముఖ్యత ఎన్నో రెట్లు పెరిగింది. మా డిక్షనరీల నూతన మరియు అప్డేటెడ్ వెర్షన్లు వినూత్నంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇవి విద్యార్ధులు ఆంగ్లంను మరింత ప్రభావవంతంగా మరియు క్షుణ్ణంగా అభ్యసించేందుకు తోడ్పడతాయి. మేము ప్రతి అభ్యాసకుని అవసరాలకనుగుణంగా వారి అభ్యాస ప్రక్రియను సరళతరం చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. లాంగ్మన్కు ఘనమైన చరిత్ర ఉంది మరియు 1978 నుంచి ప్రపంచశ్రేణి ఆంగ్ల డిక్షనరీలలో సుప్రసిద్ధమైనపేరుగా ఉంది. అంతర్జాతీయంగా ఎంతోమంది ప్రజలు దీనిని విశ్వసిస్తున్నారు మరియు ఈ డిక్షనరీలు భారతీయ అభ్యాసకుల నడుమ ప్రత్యేక స్థానం పొందడంతో పాటుగా అత్యవసర భాషా నైపుణ్యంలో వారిని మాస్టర్స్‌గా మార్చడంలో ఉత్ర్పేరకంగానూ నిలువనుందనే విశ్వాసంతో ఉన్నాం’’ అనిఅన్నారు.
లాంగ్మన్ ఇంగ్లీష్ డిక్షనరీల యొక్క నూతన వెర్షన్స్‌లో ఇవి జోడించబడ్డాయి:
లాంగ్మన్ డిక్షనరీ ఆఫ్ కంటెంపరరీ ఇంగ్లీష్ 6వ ఎడిషన్: అత్యుత్తమంగా విక్రయించబడుతున్న లాంగ్మన్ డిక్షనరీ సిరీస్‌కు నూతన జోడింపు ఎల్డీఓసీఈ6. దీనిద్వారా అభ్యాస మరియు బోధన అనుభవాలు వృద్ధి చెందుతాయి. ఈ తాజా ఎడిషన్‌లో మూడు లక్షలకు పైగా పదాలు, పదబంధాలు మరియు అర్థాలు మరియు 88వేల ఉచ్ఛారణ సంబంధిత ఉదాహరణలు, ఒక మిలియన్‌కు పైగా అదనపు కార్పస్ ఉదాహరణలు ఉన్నాయి. సమగ్రమైన కోలొకేషన్స్ డిక్షనరీకి సైతం ఈ పుస్తకం ఆతిథ్యమివ్వడంతో పాటుగా 1,47000 కొలోకేషన్స్ మరియు సమగ్రమైన విజ్ఞానసర్వస్వములును 48వేలకు పైగా సమానార్థాలు, వ్యతిరేకార్థాలు మరియు సంబంధితపదాలతో అందిస్తుంది.
లాంగ్మన్ ఎలిమెంటరీ డిక్షనరీ: నూతనంగా ఆధునీకరించిన లాంగ్మన్ ఎలిమెంటరీ డిక్షనరీ వినూత్నమైన డిక్షనరీ. దీనిని ఆంగ్ల భాషను మరింత సమగ్రంగా అభ్యసించేలా విద్యార్థులకు తోడ్పడేందుకు తీర్చిదిద్దారు. ఈ డిక్షనరీలో 2800కు పైగా సంబంధిత ఆంగ్ల పదాలు ఉంటాయి. వీటిలో సమకాలీన సంబంధిత పదాలు కూడా భాగంగా ఉంటాయి. ఈ డిక్షనరీ మరింత వివరణాత్మకంగా ఉండటంతో పాటుగా పదాల అర్థాన్ని విద్యార్థులకు బాగా అర్థమయ్యే రీతిలో తెలిపేందుకు సహాయపడుతూ ఉదాహరణలు సైతం ఉంటాయి.
లాంగ్మన్ బేసిక్ ఇంగ్లీష్ డిక్షనరీ: నూతనంగా ఆధునీకరించిన లాంగ్మన్ బేసిక్ ఇంగ్లీష్ డిక్షనరీ మూడవ ఎడిషన్ ద్వారా పదాలను మరింత సులభంగా అభ్యసించేలా సహాయపడుతున్నారు. ఇంటర్మీడియట్ ముందు స్ధాయిలోని విద్యార్థులు మరింత ఆస్వాదించతగిన రీతిలో పదాలను అభ్యసించేలా 13వేలకు పైగా పదాలను అతి సరళంగా, స్పష్టంగా మరియు సులభతరమైన నిర్వచనాలతో అందిస్తుంది.
లాంగ్మన్ డిక్షనరీ ఆఫ్ కామన్ ఎర్రర్స్ 2ఈ: లాంగ్మన్ డిక్షనరీ ఆఫ్ కామన్ ఎర్రర్స్‌ను పూర్తిగా లాంగ్మన్ లెర్నర్స్ కార్పస్ ఆధారంగా తీర్చిదిద్దారు. ఇది స్పష్టమైన లేఔట్ మరియు అతి సులభంగా వినియోగించతగిన ఫార్మాట్లో ఉండటంతో పాటుగా తాము మాట్లాడే లేదా రాసే ఆంగ్లంలో తప్పులు సరిదిద్దుకోవాలనుకునే విద్యార్థులకు పూర్తి ఉపయుక్తమైన మార్గదర్శిగా ఉంటుంది.
లాంగ్మన్ న్యూ జూనియర్ ఇంగ్లీష్ డిక్షనరీ, 2ఈ (అప్డేటెడ్ ఎడిషన్) ః ఈ నూతన ఎడిషన్ విద్యార్థులకు పూర్తి ఆనందాన్ని కలిగించనుంది. దీనిలో ఇలస్ట్రేషన్స్, లుసిడ్ మరియు సహజసిద్ధమైన ఉదాహరణలు మరియు 12వేలకు పైగా నూతన పదాలు ఉంటాయి.
లాంగ్మన్ యాక్టివ్ స్టడీ డిక్షనరీ, 5ఈ: ఈ స్ధాయిలో పూర్తి ఆధునీకరించిన మరియు సమగ్రమైన డిక్షనరీ ఇది. ఒక లక్షకు పైగా పదాలు, పదబంధాలు మరియు అర్థాలు దీనిలో ఉన్నాయి. ఇది అబ్యాసకునికి అత్యుత్తమ విలువను అందించడంతో పాటుగా అవగాహనను అందిస్తుంది.
లాంగ్మన్ డిక్షనరీల గురించిన మరింత సమాచారం కోసం https://www.amazon.in/stores/page/20A5AB8D-06A4-4333-B03E-8B7900D60E92 చూడండి. ఈ డిక్షనరీలను కొనుగొలు చేసేందుకు అమెజాన్‌పై అందుబాటులో ఉన్నాయి.