న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా పోలీస్ పతకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంద. ఈ సందర్భంగా కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సోమవారం పోలీస్ పతకాలు ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ తెలుగు రాష్ట్రాలకు భారీగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు పోలీస్ అధికారులకు ఈ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ 14 పోలీస్ మెడల్స్, రాష్ట్రపతి విశిష్ట సేవ 2, విశిష్ట సేవ కేటగిరీలో 12 పతకాలు ప్రకటించారు. వీరిలో హైదరాబాద్ అదనపు సిపి శిఖా గోయల్‌కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 18 పోలీస్ మెడల్స్, ఒక రాష్ట్రపతి విశిష్ట సేవ, 2 గ్యాలంట్రీ పతకాలు, విశిష్ట సేవ కేటగిరీలో 15 మందికి పతకాలు వచ్చాయి. అవి కాకుండా ఏపికి చెందిన కలగర్ల సాహితికి రాష్ట్రపతి ఉత్తమ జీవన్ రక్ష పడక్ పతకం వరించింది. అలాగే ఎం. అరుణ్ కుమార్, అరిగెల రత్న రాజులకు సేవా పతకాలు వరించాయి.