న్యూఢిల్లీ: కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహా వీర్ చక్ర ప్రకటించింది. సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు (బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి) గత ఏడాది జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఘటనలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు మొత్తం 20 మంది సైనికులు అమరులయ్యారు.