Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కోల్‌కతా లక్ష్యం 153
  • పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!
  • లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం
  • అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు

Tue 02 Mar 04:20:22.413939 2021

- మోడీజీ... మాకు వ్యాక్సిన్‌ అక్కర్లేదు!
- మా ఉక్కు సంకల్పమే కరోనా నుంచి రక్ష
- రైతు వ్యతిరేక చట్టాలపై గర్జించిన కర్షకలోకం
- టిక్రీలో రోడ్డుపైనే శౌచాలయాల నిర్మాణం
- ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు పంజాబ్‌ అసెంబ్లీ సంతాపం
- సాగు చట్టాలకు ప్రధాని మళ్ళీ సమర్థన
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాని మోడీ వేసుకున్నట్టు తమకు కరోనా టీకాలు అక్కరలేదని సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు ఉద్ఘా టించారు. తమ ఉక్కు సంకల్పమే కరోనా నుంచి దానికంటే ప్రమాదకరమైన ఈ ఖేతి కానూన్ల నుంచి కాపాడుతుందని ధీమా వ్యక్తంచేశారు. సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పీఎం మోడీ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడంపై గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు తీవ్రంగా స్పందించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కర్షక లోకం తుది శ్వాసవిడిచే వరకూ పోరాడుతుం దనీ, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జిస్తుం దని పునరుద్ఘాటించారు. ప్రధాని మోడీ కంటే కూడా వయ స్సులు పెద్దవారు అనేకమంది రైతులు ఉద్యమ స్థలిలో ఉండి పోరాడుతున్నారనీ, అయి నా తమకేం వ్యాక్సిన్‌ అవసరమే లేదని స్పష్టం చేశారు. 'అంటువ్యాధి మా ఆందోళనకు ఏమా త్రం అడ్డంకి కాదు' అని ఢిల్లీ సరిహద్దు టిక్రీ వద్ద ఆందోళనలో ఉన్న 75 ఏండ్ల వృద్ధ రైతు చెప్పారు. కాగా, ఇది సర్వత్రా చర్చనీయాంశ మైంది. అసలు తనకు కరోనానే రాదని, తనది కష్టంతో కూడుకున్న శరీరమని అన్నారు.
96వ రోజుకు ఉద్యమం..
పార్లమెంట్‌లో అప్రజాస్వామికంగా ఆమోదించుకున్న మూడు సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, రైతన్నలు పండించిన పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాలు ఘాజీపూర్‌, పల్వాల్‌, ఢిల్లీ-హర్యానా-రాజస్థాన్‌ సరిహద్దు ప్రాంతం షాజహాన్‌పూర్‌లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు సోమవారంతో 96 రోజుకు చేరింది. వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు యత్నిస్తున్నారు.
టిక్రీవద్ద శాశ్వత శౌచాలయాలు
సాగు వ్యతిరేక చట్టాలపై ఉధతంగా పోరాడుతున్న రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీలో శాశ్వత శౌచాలయాల నిర్మాణానికి పూనుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నుటువంటి బ్రాతురూమ్‌లు సరిపోవడం లేదనీ, దానికితోడు ఉద్యమిస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అన్నదాతల ఆందోళనల పట్ల మోడీ సర్కారు వైఖరిని గమనిస్తే తమ డిమాండ్ల పట్ల ఏమాత్రం స్పందించకపోవడంతో ఇంకా చాలా రోజులు ఉద్యమించాల్సి వస్తుందని రైతులు నిర్మాణాన్ని తలపెట్టారు. ఈ ఏర్పాట్లు చేసుకుంటే తాము ఇంకో సంవత్సరమైనా ఇక్కడే ఉండి పోరాడేందుకు సిద్ధమని స్థానిక రైతు అవతార్‌ సింగ్‌ మీడియాకి వెల్లడించారు. రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తునే తాము ఇంటికి వెళతామని స్పష్టం చేస్తున్నారు.
బెయిల్‌పై పంజాబ్‌ రైతులు విడుదల
గణతంత్ర దినోత్సవం రోజు చోటు చేసుకున్న హింసలో అరెస్టయిన ఏడుగురు పంజాబ్‌ రైతులు బెయిల్‌పై సోమవారం విడుదలయ్యారు. విడుదలకాగానే.. వారంతా టిక్రీలోని రైతు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. వారిని రైతులు సన్మానించారు. కిసాన్‌ ఏక్తా జిందాబాద్‌... మోడీ సర్కార్‌ ముర్దాబాద్‌... జై హింద్‌ నినాదాలతో ఆ ప్రాంతమంతా హౌరెత్తింది. ఢిల్లీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి తమను జైల్లో పెట్టారనీ, కానీ కోర్టుల్లో తాము ఏంటో నిరూపించుకుంటామని విడుదలైన తర్వాత రైతు బూటా సింగ్‌ మీడియాకి వెల్లడించారు.
పంజాబ్‌ అసెంబ్లీ సంతాపం
సాగు వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 248 మంది అన్నదాతలకు పంజాబ్‌ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. రైతు ఉద్యమంలో అకాల మృతి చెందిన వారికి నివాళులర్పించేందుకు రాష్ట్ర శాసనసభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అయితే, రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.
కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌తో రైతుల ఆదాయం రెట్టింపు : ప్రధాని
తాజాగా అమలు చేసిన చట్టాల్లోని కీలకమైన కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌తో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. సాగు రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు అన్న అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో కలిసి ప్రధాని వెబ్‌నార్‌లో ప్రసంగించారు. దేశంలోని సాంప్రదాయ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఆధునిక పద్దతులతో ఈ రంగంలో మరిన్ని అద్భుతాలు చేయాలన్నారు. ప్రపంచ మార్కెట్‌కు మన దేశ ఆహార ఉత్పత్తులు అందజేసి, రైతుల జీవితాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలన్నారు.
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర : రాకేశ్‌ తికాయత్‌, బీకేయూ
ఖేతి కానూన్లపై ఉధతంగా పోరాడుతున్న రైతుల పోరాటాన్ని ఏ విధంగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ వెల్లడించారు. ఇన్ని రోజుల నుంచి ఉద్యమిస్తున్న తమతో చర్చలు జరపకుండా చెప్పిందే... చెప్పి దేశ ప్రజానీకాన్ని ఈ విషయంలో మోడీ సర్కారు తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం మౌన పాత్ర వహించడంలో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టు తాము అనుమానిస్తున్నామని వివరించారు. కేంద్రం ఎంతటి కుట్రలు చేసినా తమ ఐక్యత, పోరాటశైలీని దెబ్బకొట్టలేరని చెప్పుకొచ్చారు. చట్టాలను రద్దు చేసేదాకా పోరాటం చేస్తామని అన్నారు.
భారత్‌-పాక్‌ సరిహద్దులో ఏఐకేఎస్‌ కిసాన్‌ మజ్దూర్‌ కన్వెన్షన్‌ నిర్వహణ
వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన కోట్‌ సిద్దు గ్రామంలో ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) కిసాన్‌ మజ్దూర్‌ కన్వెన్షన్‌ పెద్ద ఎత్తున నిర్వహించింది. కాగా, ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐకేఎస్‌ పంజాబ్‌ కార్యదర్శి గురు చేతన్‌ సింగ్‌ బస్సీ, సుచా సింగ్‌ అంజాలా, దర్బార్‌ సింగ్‌ లోపకే, జోరా సింగ్‌ అవాన్‌ పాల్గొన్నారు. రైతు చట్టాల వల్ల కలిగే నష్టాలను నాయకులు రైతులకు వివరించారు. దీంతో అక్కడి వారంతా చట్టాలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానించారు. కాగా, ఈ సమావేశంలో పంజాబ్‌ సీపీఐ(ఎం) కార్యదర్శి సుఖ్‌విందర్‌ సింగ్‌ షెకాన్‌ సంఘీభావం తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కన్నీళ్లే..
9లక్షల కోట్లు ఆవిరి
రాఫెల్‌ స్కాం పై.. విచారణకు సుప్రీం ఓకే
కరోనా రంకె..
రేపు బహుజన-కిసాన్‌ ఏక్తా దివస్‌
సుప్రీం కోర్టులో సగం మందికి పాజిటివ్‌
చర్చలకు సిద్ధమే.. డిమాండ్లలో మార్పు లేదు
నిరసన తెలిపే హక్కు ఉంది..
గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
టీకోత్సవమెలా?
తగ్గని కరోనా ఉధృతి
కరోనాపై రెండో యుద్ధం
రెమిడెసివర్‌ ఎగుమతులపై కేంద్రం నిషేధం
అమెరికా యుద్ధ విన్యాసాలు వెనుక పెద్ద వ్యూహమే
గోవా పోలీసుల తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం
కూచ్‌ బెహార్‌ జిల్లాలో రాజకీయ నాయకుల పర్యటనపై ఈసీ నిషేధం
షెడ్యూల్‌ ప్రకారమే నీట్‌
పెన్షన్‌రంగంలో 74శాతం ఎఫ్‌డీఐలు
కరోనాకు భయపడం
ఉగాది కానుక..
కార్పొరేట్ల కన్ను...
చమురు డిమాండ్‌ డీలా
పేలిన తూటా...
దిగ్బంధనం
ముదురుతున్న ముప్పు
త్రిపురలో బీజేపీకి షాక్‌
కరోనా టీకాల కొరత !
మరో ఎన్నికల జిమ్కిక్కు ...
విద్యార్థుల హక్కుల ఉల్లంఘన
వాహనరంగంపై మరో పిడుగు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.