Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మోడీ సర్కారు పాలనలో భారత్లో మీడియా స్వేచ్ఛ ఎంత దారుణంగా ఉన్నదో మరోసారి వెల్లడైంది. యూఎస్ తాజాగా విడుదల చేసిన 'మానవ హక్కుల నివేదిక'లో ఈ విషయం వెల్లడైంది. భారత్లోని మీడియా సంస్థలు అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి 'తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులను' ఎదుర్కొంటున్నాయని వివరించింది. భారత్లోని పరిస్థితులపై నివేదికలో 68 పేజీలతో నివేదికలోని ఒక అధ్యయనంలో ప్రస్తావించారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో అధికారుల తప్పుల విషయంలో జవాబుదారీతనం లోపించిం దని నివేదిక పేర్కొన్నది. భావప్రకటనా స్వేచ్ఛపై దాడుల విషయంలో కేంద్రం తరచూ మౌనం వహిస్తోందని వివరించింది. మీడియా గొంతులను నొక్కడానికి దేశంలోని అధికార యంత్రాంగాలు.. భద్రత, పరువునష్టం, దేశద్రోహం, ద్వేషపూర్తి ప్రసంగాల చట్టాలు, కోర్టు ధిక్కరణల ఆరోపణలు వంటి వాటిని ఉపయోగించాయని నివేదిక వెల్లడించడం గమనార్హం.