Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 711 మంది ఏపీి నుంచి రిలీవ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న 711 మంది తెలంగాణకు చెందినవారు తమ సొంత రాష్ట్రానికి రిలీవ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణకు చెందిన తమను అక్కడే ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో 711 మంది ఉద్యోగుల ప్రతినిధులు సీిఎంను బుధవారం కలిసి తమ కష్టాలను వివరించారు. తమను ఏపీిలో రిలీవ్ చేయాలని కోరారు. దీనిపై సీిఎం సానుకూలంగా స్పందించి రిలీవ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. సొంత రాష్ట్రానికి వెళ్లనున్న ఉద్యోగులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తమను సొంత రాష్ట్రానికి రిలీవ్ చేయడం పట్ల తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీిఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.