Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిటి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్
న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న దని, పలు రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని నిటి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ వ్యాఖ్యానించారు. మార్చి 24-31 వరకూ ప్రతిరోజూ దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల నమోదు 50వేలు దాటుతోంది.
ఇందులో 84శాతం కేసులు మహా రాష్ట్ర, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఓవైపు భారీఎత్తున కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా, మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి పెరగటం అందరిలో భయాల్ని పెంచింది. కరోనా వైరస్‌లో కొత్తరకం కేసుల పెరుగుదలకు కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు.