Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : వివాదాస్పద బాలీవుడ్ నటుడు, బిగ్బాస్-7 ఫేమ్ అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి అజాజ్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారి తెలిపారు. రాజస్తాన్ నుంచి మంగళవారం ముంబైకు చేరిన ఖాన్ను ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల పెడ్లర్ షాదాబ్ బటాటాను ప్రశ్నించినప్పుడు అజాజ్ఖాన్ పేరు వెలుగులోకి రావడంతో ఎన్సీబీ ఖాన్ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి నగరంలోని అంధేరి, లోఖండ్వాలా ప్రాంతాల్లో ఎన్సిబి దాడులు చేపట్టింది. అజాజ్ను ఎన్సిబి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్సీబీ కార్యాలయం బయట ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎవరూ అదుపులోకి తీసుకోలేదని, తానే స్వయంగా అధికారులను కలవడానికి వచ్చానని తెలిపారు.