Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌహతి : ప్రస్తుతం జరుగుతున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 264 మంది కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 126 స్థానాల్లో పోటీలో ఉన్న మొత్తం 946 అభ్యర్థుల్లో వీరు 27.90 శాతం. వీరిలో అత్యంత ధనవంతుడిగా కోక్రాఝర్ వెస్ట్‌లో పోటీచేస్తున్న యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్స్ (యుపీపీఎల్) అభ్యర్థి మనరంజన్ బ్రహ్మ నిలిచారు. ఇతని ఆస్తుల విలువ రూ.268 కోట్లు. తరువాత స్థానం ఉదహర్బంద్ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాహుల్ రారుది. ఇతని ఆస్తుల విలువ రూ 136 కోట్లు. జమునముఖ్ స్థానంలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థి సిరాజద్దీన్ అజ్మాల్ అస్తుల విలువ రూ.111 కోట్లు. ఈ ఆస్తులను అభ్యర్థులు తమ అఫిడవిట్లో స్వయంగా ప్రకటించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం కాంగ్రెస్ నుంచి అత్యధికం 64 మంది కోటీశ్వర్లు (ఒక కోటి కంటే ఎక్కువ ఆస్తి ఉన్నవారు) బరిలో ఉన్నారు. తరువాత బీజేపీ నుంచి 60 మంది, నూతనంగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ నుంచి 31 మంది ఉన్నారు. అసోం గణపరిషత్ నుంచి 22, ఏఐయూడీఎఫ్ నుంచి 11, బీపీఎఫ్ నుంచి 8 మంది, యూపీపీఎల్ నుంచి ఒకరున్నారు.