Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు పోలీసు అధికారులను వదిలిపెట్టిన సీబీఐ
అహ్మదాబాద్ : ముగ్గురు పోలీసు అధికారులను సీబీఐ కోర్టు డిశ్చార్జ్ చేసింది. 2004లో ఇష్రత్ జహాన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో జి.ఎల్.సింఘాల్, తరుణ్ బరోట్, అనజు చౌదరిలను డిశ్చార్జ్ చేయడానికి అహ్మదాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు అంగీకరించింది. ఫలితంగా, ఈ కేసులో వీరు ముగ్గురు ఎలాంటి చర్యలను లేదా విచారణను ఎదుర్కొనరు. తమ విధుల్లో భాగంగానే అధికారులు అలా వ్యవహరించారని కోర్టు పేర్కొంది. ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి వి.ఆర్.రావల్ వారి డిశ్చార్జ్ దరఖాస్తులను స్వీకరించి విచారణ జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురు నిందితులపై ప్రాసిక్యూషన్ అనుమతికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందంటూ ఈ నెల 20న సీబీఐ కోర్టుకు తెలియచేసింది. వారి వారి అధికార విధుల ప్రకారం అలా వ్యవహరించారంటూ 2020 అక్టోబరులో కోర్టు తన ఉత్తర్వులో వ్యాఖ్యానించింది. అందువల్ల ప్రాసిక్యూషన్ అనుమతిని దర్యాప్తు సంస్థ పొందాల్సి వచ్చింది. అయితే అందుకు గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించింది. గతంలో కీలక నిందితుడు పి.పి.పాండే, ఎన్.కె.అమిన్లను కూడా కోర్టు డిశ్చార్జ్ చేసింది. 2004 జూన్ 15న అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో గుజరాత్ పోలీసులు 19ఏండ్ల ఇష్రత్ జహాన్‌తో సహా నలుగురిని కాల్చి చంపారు. ఆ నలుగురు తీవ్రవాదులు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని చంపడానికి కుట్ర పన్నారని పోలీసులు పేర్కొన్నారు. హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ ఎన్‌కౌంటర్‌ను బూటకమని తేల్చింది. ఆ తర్వాత వారిపై సిబిఐ కేసు నమోదు చేసింది.