Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స విజయవంతమైందని మహారాష్ట్ర హోం మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. పొత్తి కడుపులో నొప్పి కారణంగా శరద్‌పవార్ ఆదివారం ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. బుధవారం మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ... వైద్యులు ఆపరేషన్ ద్వారా గాల్‌బ్లాడర్ (పిత్తాశయం) లోని రాయిని తొలగించారనీ, ప్రస్తుతం పవార్ ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మాట్లాడుతూ.. వైద్యులు ఆయనకు ఈ రోజు శస్త్ర చికిత్స విజయవంతగా పూర్తి చేశారని తెలిపారు. పవార్‌ను ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లు బ్రీచ్‌కాండీ వైద్యులు వెల్లడించారు.