Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీపీఎఫ్, 'సుకన్య' వడ్డీరేట్ల కోత
న్యూఢిల్లీ : బ్యాంకులు, చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సామాన్యుడు దాచుకొనే సొమ్ముపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై ఏడాదికి ప్రస్తుతం 4 శాతంగా ఉన్న వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పై ఇచ్చే వడ్డీపైనా కోత పెట్టింది. దీన్ని 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. 46 ఏండ్లలో ఇంత తక్కువ వడ్డీరేటు కావటం గమనార్హం. సీనియర్ సిటిజన్ల సేవింగ్ పథకాలపై ఇచ్చే వడ్డీని 7.4 శాతం నుంచి 6.5 శాతా నికి తగ్గించింది. సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలపై ఇచ్చే వడ్డీని 7.6 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది. సవరించిన ఈవడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నా యని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.