Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అభ్యర్థులు స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో ఈ విషయం స్పష్టం చేసినట్టు అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో తెలిపింది. మొత్తం పోటీలో ఉన్న 6,792 మంది అఫిడవిట్లలో 6,318ను ఏడీఆర్ విశ్లేషించింది. 6,318 మందిలో 1,157 మంది (18 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్పష్టం చేశారని, వీరిలో 632 మంది (10 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారని తెలిపింది. అలాగే 6318 మందిలో 1,317 మంది (21 శాతం) కోటీశ్వరులే అని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో 567 మంది అఫిడవిట్లను పరిశీలించగా 144 మంది క్రిమినల్ కేసులు, వీరిలో 121 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారని నివేదిక తెలిపింది.
తమిళనాడులో 466 మంది అఫిడవిట్లలో466 మంది క్రిమినల్ కేసులు, 207 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉఉన్నాయి. కేరళలో 928 మంది అఫిడవిట్లలో 355 మంది క్రిమినల్ కేసులు, 167 మందికి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్పష్టం చేశారు. అసోంలో 138 మంది క్రిమినల్ కేసులు, 109 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపారు. పుదుచ్చేరిలో 54 మందిపై క్రిమినల్ కేసులు, 28 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి రాజకీయ పార్టీల్లో అత్యధికంగా బిజెపి నుంచి 163 మందిపై క్రిమినల్ కేసులు, 108 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్లో 132 మంది అభ్యర్థిలు క్రిమినల్ కేసులు, 82 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. డిఎంకె నుంచి 143 మంది క్రిమినల్ కేసులు, 55 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపాయి. ఎఐఎడిఎంకె నుంచి 50 మందిపై క్రిమినల్ కేసులు, 21 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే సిపిఎం అభ్యర్థుల్లో 77 మందిపై క్రిమినల్ కేసులు, 39 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. సిపిఐలో 14 మందిపై క్రిమినల్ కేసులు, ముగ్గురిపై త్రీవమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.