Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బైపాస్ సర్జరీ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వేగంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. త్వరగా కోలుకుంటున్నానని, తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికి మాటల్లో చెప్పలేనంత కతజ్ఞతభావం ఉందని గురువారం ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో సేవలందించిన వైద్యులు, సంరక్షకుల అంకితభావానికి ధన్యవాదాలు తెలిపారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా మార్చి 26న ఆర్మీ ఆస్పత్రిలో రాష్ట్రపతి చేరారు. అక్కడ సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.