Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
నాటిన ప్రతి మొక్క ఎండిపోకుండా జాగ్రత్తలు పాటించాలని రామేశ్వర్ పల్లి గ్రామ సర్పంచ్ పోతి రెడ్డి అన్నారు. శుక్రవారం వాటర్ డే సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్ళు పోశారు. అలాగే జంగంపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అత్తిలి శ్రీనివాస్ వాటర్ డే సందర్భంగా గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకు ద్వారా మొక్కలకు నీళ్లు పోశారు. ప్రతి ఒక్కరూ వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కలు ఎండిపోకుండా ప్రతి రోజు నీళ్ళు పోయాలని సూచించారు.