Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయ్ పూర్ : కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో చత్తీస్ఘర్లోని దుర్గ్ జిల్లాలో తొమ్మిది రోజుల పాటు లాక్డౌన్ను విధించింది. స్థానిక కరోనా పరిస్థితుల దృష్ట్యా తమ అధికార పరిధిలో లాక్డౌన్ విధించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సూచించారు. దీంతో జిల్లాలో ఏప్రిల్ 6 నుండి 14 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. రారుపూర్, దుర్గ్ జిల్లాల్లో కరోనా రెండో వేవ్ కారణంగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే రెండు జిల్లాల్లో వరుసగా 1,327 మరియు 996 తాజా కేసులు నమోదయ్యాయి. రారుపూర్లో ఇప్పటివరకు 914 మంది మరణించగా, మొత్తం కేసుల సంఖ్య 66,999కి చేరింది. దుర్గ్ జిల్లాలో 754 మంది మరణించగా, కేసుల సంఖ్య 40,068కి పెరిగిందని అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ విధించామని, ప్రజలు సహకరించాలని దుర్గ్ జిల్లా కలెక్టర్ ఎస్ఎన్.బురే తెలిపారు. మరో రెండు రోజుల్లో మరికొన్ని జిల్లాల్లో కూడా లాక్డౌన్ ప్రకటించవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వం సెక్రటేరియట్, డైరెక్టరేట్ కార్యాలయాల్లో సిబ్బందిని 50 శాతానికి పరిమితం చేసింది.